T20 World Cup 2026: అందరి చూపు ఈ ఐదుగురిపైనే.. పిల్లబచ్చా టీంలో ఉన్నారని లైట్ తీసుకుంటే, తాట తీస్తారంతే..!

Updated on: Feb 06, 2026 | 11:34 AM

5 Players to Watch in T20 World Cup 2026: అంతర్జాతీయ టీ20 లీగ్‌లు విపరీతంగా విస్తరిస్తున్న క్రమంలో, ఐసీసీ టోర్నమెంట్లు ఆటగాళ్లకు ఒక గొప్ప వేదికగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ యజమానుల దృష్టిలో పడటమే కాకుండా, ఆర్థికంగా కూడా ప్లేయర్లకు మంచి లాభం చేకూరుతుంది.

1 / 6
ఈసారి వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 20 జట్లు టీ20 ప్రపంచకప్ 2026 బరిలో నిలిచాయి. అలాగే, తొలిసారి అడుగుపెడుతున్న ఇటలీతో పాటు అమెరికా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాలు కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ జట్లు ఐసీసీ ఈవెంట్లలో దిగ్గజ జట్లకు షాక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ క్రమంలో అసోసియేట్ దేశాల నుంచి బరిలోకి దిగనున్న ఈ ఐదురుగు ప్లేయర్లను తక్కువ అంచనా వేస్తే కచ్చితంగా తగిన శాస్తి చేస్తారంతే. ఈ లిస్ట్ లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

2 / 6
1. ఆండ్రీస్ గౌస్ (USA): అమెరికా జట్టుకు ప్రధాన బలంగా ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ నిలవనున్నాడు. దక్షిణాఫ్రికాలో తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌస్.. 2021లో అమెరికాకు మకాం మార్చాడు. 2024 వరల్డ్ కప్‌లో గౌస్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా తన సొంత దేశమైన దక్షిణాఫ్రికాపై ఆయన చేసిన 80 (నాటౌట్) పరుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు అమెరికా తరపున 25 టీ20ల్లో 751 పరుగులు చేసిన గౌస్, 145కుపైగా స్ట్రైక్ రేట్‌తో డేంజరస్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.

3 / 6
2. వేన్ మాడ్సెన్ (ఇటలీ): తొలిసారి వరల్డ్ కప్‌లో అడుగుపెడుతున్న ఇటలీ జట్టుకు వేన్ మాడ్సెన్ నాయకత్వం వహించనున్నాడు. విశేషమేమిటంటే, మాడ్సెన్ గతంలో దక్షిణాఫ్రికా తరపున హాకీ ప్లేయర్‌గా 2006 కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్‌లో ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌లోకి మారి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో డెర్బీషైర్ తరపున 20,000 పైగా పరుగులు సాధించాడు. 41 ఏళ్ల వయసులో కూడా తన అపారమైన అనుభవంతో ఇటలీ జట్టును ముందుకు నడిపించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు.

4 / 6
3. ముహమ్మద్ వసీం (UAE): 2024 టోర్నీకి దూరమైన యూఏఈ (UAE), ఈసారి కెప్టెన్, స్టార్ బ్యాటర్ ముహమ్మద్ వసీంపై ఆశలు పెట్టుకుంది. వసీం అత్యంత దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాటర్. ఐర్లాండ్‌పై కేవలం 62 బంతుల్లో 107 పరుగులు చేసి ప్రపంచానికి తన పవర్ ఏంటో చూపించాడు. ఇప్పటివరకు 91 మ్యాచ్‌ల్లో 3,184 పరుగులు చేసిన వసీం, 151కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఇటీవలి ILT20 లీగ్‌లో కూడా రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచి ఫామ్ చాటుకున్నాడు.

5 / 6
4. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్): 41 ఏళ్ల ఈ వెటరన్ ఆల్ రౌండర్‌కు ఇది ఏడో వరల్డ్ కప్. గతంలో దక్షిణాఫ్రికా తరపున ఆడిన మెర్వే, ఆ తర్వాత నెదర్లాండ్స్‌కు మారి కీలక ఆటగాడిగా ఎదిగారు. ఐపీఎల్ (ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్) వంటి ఎన్నో అంతర్జాతీయ లీగ్‌లలో ఆడిన అనుభవం ఆయనకు ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యం మెర్వే సొంతం. నెదర్లాండ్స్ తరపున ఆడిన 80 మ్యాచ్‌ల్లో 88 వికెట్లు తీసి తన విలువను చాటుకున్నాడు.

6 / 6
5. దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్): నేపాల్ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు దీపేంద్ర సింగ్ ఐరీ. ఈ ఆల్ రౌండర్ 2022 ఆసియా క్రీడల్లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టీ20 చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు, యువరాజ్ సింగ్, పొలార్డ్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నేపాల్ తరపున అత్యధిక టీ20 పరుగులు (1,956), ఐదో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఈ 2026 వరల్డ్ కప్‌లో నేపాల్‌కు ఆశాకిరణంగా మారాడు.