
Ben Strokes: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన రికార్డ్ సాధించాడు. ఇప్పటివరకు గ్యారీ సోబర్స్, జాక్వెస్ కల్లిస్ పేరిట మాత్రమే ఉన్న రికార్డ్‌ను తన పేరిట కూడా లిఖించుుకున్నాడు. అందుకోసం ఈ ప్లేయర్ ఏం చేశాడంటే..

యాషెస్ ఐదో టెస్టులో బెన్ స్టోక్స్.. ఆసీస్ ఆటగాళ్లైన అలెక్స్ కారీ, ప్యాట్ కమ్మిన్స్ క్యాచ్‌లను పట్టుకుని టెస్ట్ క్రికెట్‌లో 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఇంగ్లీష్ కెప్టెన్ టెస్టు క్రికెట్‌లో 6 వేల పరుగులు, 150 వికెట్లు, 100 క్యాచ్‌ల మార్క్‌ను దాటిన మూడో ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు.

స్టోక్స్ కంటే ముందు ఇద్దరే ఈ ఫీట్‌ని అందుకున్నారు. వారిలో వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ టెస్టు క్రికెట్‌లో 6000 పరుగులు, 150 వికెట్లు, 100 క్యాచ్‌ల మార్క్‌ని చేరుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డ్‌ల్లో నిలిచాడు. గ్యారీ సోబర్స్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 8,032 పరుగులు, 109 క్యాచ్‌లు, 235 వికెట్లు తీసుకున్నాడు.

గ్యారీ సోబర్స్ తర్వాత దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ కూడా ఈ ఘనత సాధించాడు. కలిస్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం కల్లిస్ 13,289 200 క్యాచ్‌లు, 292 వికెట్లు పడగొట్టాడు.

యాషెస్ 5వ టెస్ట్ ద్వారా బెన్ స్టోక్స్ కూడా ఈ మైలురాయిని అందుకున్నాడు. స్ట్రోక్స్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 6092 197 వికెట్లు 100 క్యాచ్‌లు పట్టుకున్నాడు.