
IPL 2022 మెగా వేలానికి ముందు RCB విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను కలిగి ఉంది. వేలంలో తమతో పాటు కొంతమంది గొప్ప ఆటగాళ్లను చేర్చుకుంటుంది. అయితే అంతకు ముందు వచ్చే సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ప్రశ్న.

క్రిక్ ఇన్‌ఫోతో జరిగిన సంభాషణలో డేనియల్ వెట్టోరి మాట్లాడుతూ 'RCB కెప్టెన్‌గా గ్లెన్ మాక్స్‌వెల్‌ను నియమిస్తుందని నేను భావిస్తున్నాను. గత సీజన్‌లో మాక్స్‌వెల్ ప్రదర్శన అద్భుతం. మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్‌గా అతనికి చాలా అనుభవం ఉంది' అన్నాడు.

గ్లెన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అతను IPLలో కింగ్స్ XI పంజాబ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు బిగ్ బాష్‌లో అతను 62 మ్యాచ్‌లలో 34 గెలిచిన మెల్‌బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

గ్లెన్ మాక్స్‌వెల్ గత సీజన్‌లో RCB కోసం అద్భుతమైన ఆటని ప్రదర్శించాడు. జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

రాబోయే సీజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరు భావిస్తున్నారు. అంతేకాదు కెప్టెన్‌ని మార్చడం వల్ల ఆర్‌సీబీ అదృష్టం ఏమైనా మారుతుందని ఐపీఎల్‌ను గెలుస్తారని అనుకుంటున్నారు.