MS Dhoni: ధోని సారథ్యంలో ఆడి, ఆపై ట్రోఫీ విజేతలుగా నిలిచిన కెప్టెన్లు వీరే.. లిస్టులో తాజాగా చేరిన ఇమ్రాన్ తాహీర్..

|

Sep 25, 2023 | 9:55 PM

MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఎందరో క్రికెటర్లు రాటుదేలారు. అందుకే చాలా మంది క్రికెటర్లకు ధోనియే కెప్టెన్‌గా రోల్ మోడల్. సహచర ఆటగాళ్లకు ధోని అందించినంత ప్రోత్సాహం మరే ఇతర కెప్టెన్ అందించలేడని అనేక మంది క్రికెటర్లు కూడా చెప్పిన మాట. బహుశా అదే కారణమేమో.. ధోని సారథ్యంలో ఆడిన కొందరు ప్లేయర్లు, తర్వాతి కాలంలో కెప్టెన్ అవతారమెత్తి ట్రోఫీ విజేతలుగా నిలిచారు. ఇలా టైటిల్ విన్నర్‌గా మారిన ధోని సహచరుల లిస్టులో తాజాగా ఇమ్రాన్ తాహిర్ కూడా చేరాడు. ఇంతకీ ధోని కెప్టెన్సీలో ఆడి, తర్వాత టోర్నీ విన్నర్లుగా మారిన ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5
ఇమ్రాన్ తాహీర్: గుయానా అమెజాన్ వారియర్స్ ఇమ్రాన్ తాహీర్ నేతృత్వంలో సీపీఎల్ 2023 టోర్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 44 ఏళ్ల తాహీర్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడాడు.

2 / 5
హార్దిక్ పాండ్యా: ధోని సారథ్యంలోనే హార్దిక్ పాండ్యా వన్డే, అంతర్జాతీయ టీ20 కెరీర్స్ ప్రారంభించాడు. అలా ధోని సారథ్యంలో అనేక మ్యాచ్‌లు ఆడిన పాండ్యా ఐపీఎల్ 2022 టోర్నీలో గుజరాత్ టైటాన్స్‌కి కప్ అందించాడు. ఐపీఎల్ 2023 టోర్నీలో కూడా విజేతగా నిలిచే ప్రయత్నం చేశాడు కానీ ప్రత్యర్ధి ధోని కావడంతో హార్దిక్‌కి నిరాశే మిగిలింది. ఇంకా ఐపీఎల్ 2023 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.

3 / 5
రోహిత్ శర్మ: భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 వరల్డ్ కప్ నాటి కంటే ముందు నుంచే ధోని సారథ్యంలో ఆడుతూ వచ్చాడు. ఇలా సుదీర్ఘ కాలం పాటు ధోని టీమ్‌లో ఆడిన రోహిత్ 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఆసియా కప్స్, చాంపియన్స్ లీగ్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

4 / 5
గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్ కూడా 2007 టీ20 వరల్డ్ కప్ నాటి కంటే ముందు నుంచే ధోని సారథ్యంలో ఆడాడు. ధోని సారథ్యంలోనే 2011 వరల్డ్ కప్ కూడా ఆడిన గౌతీ.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా ఐపీఎల్ 2012, ఐపీఎల్ 2014 టోర్నీల్లో తన టీమ్‌ని విజేతగా నిలిపాడు.

5 / 5
సచిన్ టెండూల్కర్: వంద సెంచరీల వీరుడు, క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ధోని సారథ్యంలో చాలా మ్యాచ్‌లు ఆడాడు, ఇంకా ధోని టీమ్ ప్లేయర్‌గానే ఆటకు వీడ్కోలు పలికాడు. అలాంటి సచిన్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సరీస్ 2021, రోడ్ సేఫ్టీ వరల్డ్ సరీస్ 2022 టోర్నీల్లో తన జట్టును విజేతగా నిలిపాడు.