ఒక్క ఇన్నింగ్స్.. డజన్ల కొద్దీ రికార్డులు.! RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల సైక్లోన్

Updated on: Mar 28, 2026 | 5:31 PM

ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ గేల్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఒక అద్భుతం. పూణే వారియర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో గేల్ కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం పరుగుల ప్రవాహమే కాదు, అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఈ రికార్డు చెక్కుచెదరలేదు.

1 / 5
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనలలో ఒకటి క్రిస్ గేల్ 175 పరుగులు. 2013 ఏప్రిల్ 23న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), పూణే వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూనివర్స్ బాస్ తన బ్యాట్‌తో తుఫాను సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల ప్రవాహమే కాదు, ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ రోజు మంగళవారం, మ్యాచ్ నెంబర్ 31. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని పూణే వారియర్స్ టాస్ గెలిచి, ఆర్‌సీబీని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్ ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా దిగారు. భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్‌లో గేల్ కంట్రోల్‌తో ఉన్నా, ఈశ్వర్ పాండే వేసిన రెండో ఓవర్‌లోని మొదటి రెండు బంతులను గేల్ బౌండరీలకు పంపించడంతో ఊచకోత మొదలైంది.

2 / 5
రెండో ఓవర్ తర్వాత అకస్మాత్తుగా వర్షం కురవడంతో మ్యాచ్ అరగంట పాటు నిలిచిపోయింది. ఈ విరామంలో గేల్ తన సహచరుడు రవి రాంపాల్‌తో మాట్లాడుతూ, "ఈ పిచ్ చాలా బాగుంది. మ్యాచ్ గెలవాలంటే మనం కనీసం 180 పరుగులు చేయాలి" అని చెప్పాడట. అయితే, ఆ 180 పరుగులలో ఎక్కువ భాగం తన బ్యాట్ నుంచే వస్తాయని గేల్‌కు తెలియదు. వర్షం తగ్గిన తర్వాత, నిజంగా పరుగుల వర్షమే కురిసింది. కేవలం 17 బంతుల్లో గేల్ 50 పరుగులు సాధించి, ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధసెంచరీలలో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కించాడు. బెంగళూరు స్కోరు 80 పరుగులకు చేరుకున్నప్పుడు, అందులో 67 పరుగులు కేవలం గేల్ చేసినవే.

3 / 5
ఎనిమిదో ఓవర్ వేయడానికి పూణే కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్‌కు వచ్చాడు. స్ట్రైక్‌లో దిల్షాన్ ఉండటంతో ఫించ్ కొద్దిగా ఉపశమనం పొందాడు. కానీ దిల్షాన్ సింగిల్ తీయడంతో గేల్ స్ట్రైక్‌కు వచ్చాడు. ఆ తర్వాతి ఐదు బంతుల్లో గేల్ వరుసగా 1, 6, 6, 4, 6, 6 పరుగులతో మొత్తం 29 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ తర్వాత ఆరోన్ ఫించ్ ఐపీఎల్‌లో మళ్లీ ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే, ఆసక్తికరంగా, ఫించ్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడటం గమనార్హం.

4 / 5
గేల్ తన సెంచరీని తొమ్మిదో ఓవర్‌లో సాధించాడు. అశోక్ దిండా బౌలింగ్‌లో 96 పరుగుల వద్ద ఉన్నప్పుడు, అతను వేసిన నో-బాల్‌ను గేల్ ఫ్రీ హిట్‌గా మార్చుకొని భారీ షాట్ కొట్టాడు. బంతి చిన్నస్వామి స్టేడియం పైకప్పును తాకగా, దానిలోని ఒక భాగం విరిగి కింద పడింది. ఈ విధ్వంసం మధ్యలో పూణే బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మాత్రం గేల్ ప్రతాపం నుంచి తప్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చి, ఆర్‌సీబీ భారీ స్కోరులో తానొక ఆణిముత్యం అని మరోసారి నిరూపించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ తర్వాత, "గేల్ ఇలాంటి బ్యాటింగ్ చేసినప్పుడు, ఏ బౌలర్ కూడా బౌలింగ్ చేయాలనుకోడు" అని కామెంట్ చేశాడు.

5 / 5
ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో బ్రెండన్ మెకల్లమ్ చేసిన 158 పరుగుల రికార్డును గేల్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు (17) కూడా గేల్ పేరిటే ఉంది. పూణే జట్టు 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ముందు రోజు రాత్రి గేల్ నిద్రపోలేదట. నిద్రలేమితో బాధపడుతూ రాత్రంతా తన గదిలో ప్లేస్టేషన్‌లో గేమ్స్ ఆడాడు. ఉదయం 7 గంటలకు నిద్రపోయి, మ్యాచ్ డే ప్రాక్టీస్ కూడా మిస్సయ్యాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం ఏమాత్రం తడబడకుండా చెలరేగిపోయాడు.

Follow Us