- Telugu News Photo Gallery Cricket photos Chennai Super Kings's All Rounder Shivam Dube Ruled Out From Ranji Trophy
IPL 2024: ధోని సేనకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2024కు దూరమైన సీఎస్‌కే చిచ్చర పిడుగు?
Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొత్త ఆందోళన మొదలైంది. రంజీ టోర్నీ సందర్భంగా చెన్నై టీం ప్రముఖ ఆల్ రౌండర్ గాయపడ్డాడు. ఇప్పుడు మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఎదుర్కొంటున్నాడు.
Updated on: Feb 20, 2024 | 3:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 ప్రారంభానికి కేవలం ఒక నెల మాత్రమే ఉంది. అంతకుముందే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆ జట్టు అగ్ర ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయపడ్డాడు.

రంజీ టోర్నీలో ముంబై తరపున ఆడిన శివమ్ దూబే సైడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడు. ఫిట్‌నెస్ సమస్య కారణంగా ఇప్పుడు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ కీలక దశలో శివమ్ దూబే లేకపోవడం ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.

ఎందుకంటే, ఈ రంజీ టోర్నీలో శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు సాధించాడు. దీని ద్వారా 67.83 సగటుతో 407 పరుగులు, 12 వికెట్లు పడగొట్టాడు. దూబే నాకౌట్ నుంచి నిష్క్రమించడం సీఎస్‌కే జట్టులో ఆందోళనను పెంచింది.

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన వారిలో శివమ్ దూబే ఒకరు. IPL 2023లో 418 పరుగులు చేసిన దూబే, CSKని ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. మిడిలార్డర్ కీలక బ్యాట్స్ మెన్ గాయపడడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆందోళనకు గురి చేసింది. అయితే, మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతే అతడు ఐపీఎల్‌కు దూరంగా ఉంటాడా అనేది తేలనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్‌గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతిష్ పతిరణ, అజింక్యా రహాన్, అజింక్య , ఎం. , నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేష్ తీక్షన్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, అవనీష్ రావు ఆరవెల్లి.




