
IPL 2024లో మార్చి 23న డబుల్ హెడర్ డే మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ తిరిగి వచ్చాడు. పంత్ పునరాగమనం ఉత్సాహంతో ఉన్నా.. ఢిల్లీ తన తోలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత మరో షాక్ తగిలింది.

నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో గాయం ఆందోళనను ఎదుర్కొంటోంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. పంజన్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో, ఇషాంత్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కింద పడి అతని పాదానికి గాయమైంది. గాయం కారణంగా ఇషాంత్ మైదానం వీడాల్సి వచ్చింది.

ఇషాంత్ శర్మ గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియరాలేదు. గాయం కారణంగా ఢిల్లీ జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఇషాంత్ కూడా చేరే అవకాశం ఉంది. శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను శిఖర్ ధావన్ వికెట్ పడగొట్టాడు. ప్రమాదకరమైన జానీ బెయిర్‌స్టోను రనౌట్ చేశాడు.

మైదానం వీడిన తర్వాత ఇషాంత్ శర్మ మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు. అతను వేసిన రెండు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లిస్ట్ పెద్దగానే. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్‌గిడి ఇప్పటికే దూరమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. శామ్ కర్రాన్ అర్ధ సెంచరీతో పంజాబ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.