IPL 2025: షారుఖ్, కావ్య మారన్‌లకు బీసీసీఐ ఝలక్.. ఐపీఎల్ 2025 మెగా వేలంపై కీలక నిర్ణయం

|

Aug 03, 2024 | 5:09 PM

జూలై 31న ముంబై వేదికగా ఫ్రాంచైజీలతో క్రికెట్ బోర్డు సమావేశమైంది. రిటైన్ ప్లేయర్స్, ఐపీఎల్ 2025 మెగా వేలం, RTM లాంటి అంశాలపై కీలకంగా చర్చించారు. ఇక ఈ మీట్‌లో కేకేఆర్ యజమాని షారుఖ్, ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్..

1 / 5
 షారుఖ్ ఖాన్, కావ్య మారన్‌లకు షాక్ ఇస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది క్రికెట్ బోర్డు.

2 / 5
 జూలై 31న ముంబై వేదికగా ఫ్రాంచైజీలతో క్రికెట్ బోర్డు సమావేశమైంది. రిటైన్ ప్లేయర్స్, ఐపీఎల్ 2025 మెగా వేలం, RTM లాంటి అంశాలపై కీలకంగా చర్చించారు. ఇక ఈ మీట్‌లో కేకేఆర్ యజమాని షారుఖ్, ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ మెగా వేలాన్ని ఐదేళ్లకొకసారి నిర్వహించాలని.. ఇలా చేయడం ద్వారా జట్టు నిలకడ, ప్రధాన ఆటగాళ్ల కంటిన్యూటీపై ప్రభావం పడదని పేర్కొన్న విషయం విదితమే.

3 / 5
 అయితేనేం వారి సూచనలను అటుంచితే.. వచ్చే ఏడాదికి మెగా ఆక్షన్ నిర్వహించాలని చూస్తోందట బీసీసీఐ. అలాగే రిటెన్షన్, రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా 6-8 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంచైజీలకు బోర్డు అనుమతించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించి కీలక నిబంధనలను నెలాఖరులోగా బోర్డు ఖరారు చేయనుందట.

4 / 5
ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొందరు ఫ్రాంచైజీలు ఈ రూల్‌కు సుముఖతగా ఉంటే.. మరికొందరు ఈ రూల్‌ను తీసేయాలని బోర్డును కోరారు.

5 / 5
అటు ఐపీఎల్‌ను అర్ధాంతరంగా విడిచిపెడుతున్న విదేశీ ప్లేయర్స్‌పై రెండేళ్ల పాటు బ్యాన్ విధించనుంది బీసీసీఐ. టోర్నమెంట్ నుంచి గాయం కారణంగా వైదొలిగిన ప్లేయర్స్‌కు ఈ రూల్ వర్తించదట.