World Cup 2023: వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు.. స్వ్కాడ్‌ను ప్రకటించేది ఆ రోజే?

|

Aug 29, 2023 | 11:26 AM

India's World Cup 2023 Squad: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు సెప్టెంబర్ 3న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టులో చేరే ఆటగాళ్లను బీసీసీఐ చివరి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్వ్కాడ్ వచ్చే ఛాన్స్ ఉంది.

1 / 8
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2023 కోసం సిద్ధమవుతోంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడడం ద్వారా టీమిండియా ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆసియా కప్ తర్వాత భారత్ మరో ముఖ్యమైన టోర్నీ ప్రపంచకప్‌లో తలపడనుంది.

2 / 8
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే చాలా జట్లను ప్రకటించారు. స్వ్కాడ్‌ను ప్రకటించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5. ఆ తర్వాత సెప్టెంబర్ 27లోగా అవసరమైతే జట్టులో మార్పులు చేసుకోవచ్చు. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.

3 / 8
వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న ప్రకటించే అవకాశం ఉందని ఇండియా టుడే నివేదించింది. జట్టు సభ్యులను బీసీసీఐ చివరి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్‌లో భారత్-పాక్ పోరు సెప్టెంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

4 / 8
మొత్తం ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా వివిధ వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్‌ల మధ్య కీలక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

5 / 8
ఆసియా కప్ తర్వాత, ప్రపంచకప్‌నకు ముందు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఆస్ట్రేలియాతో భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రపంచకప్‌నకు ఎంపికైన ఆటగాళ్లతోనే బరిలోకి దింపనుంది.

6 / 8
ఇదిలా ఉండగా, ఈరోజు భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 కోసం బెంగళూరు నుంచి శ్రీలంకకు విమానంలో బయలుదేరుతుంది. కొలంబో వెళ్లి ఒకరోజు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ బృందం అక్కడ మళ్లీ శిక్షణ ప్రారంభించనుంది. భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగుతాయి.

7 / 8
నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభానికి ఒకరోజు ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం.

8 / 8
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభోత్సవానికి జట్టు కెప్టెన్లందరూ హాజరుకానున్నారు. మీడియాతో కూడా మాట్లాడనున్నారు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు సారథులంతా సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఐసీసీ గత ఏడాది కూడా ఇదే ప్రణాళికను రూపొందించింది. ఈ ఏడాది కూడా ఐసీసీ ఇదే ప్రణాళికతో ముందుకు పోనున్నట్లు తెలుస్తోంది.