Cricket: సబ్‌స్టిట్యుట్‌గా టెస్టుల్లోకి ఎంట్రీ.. కోహ్లీ, స్మిత్‌లను దాటేశాడు.. ప్రపంచ నెంబర్‌వన్ అయ్యాడు..

|

Dec 24, 2021 | 9:57 AM

20 ఏళ్ల వయస్సులో ఈ ఆటగాడు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్ పట్టి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.. కట్ చేస్తే..

1 / 6
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్నస్ లబూషెన్ టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీవిడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో లబూషెన్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి అందుకున్నాడు.

2 / 6
లబూషెన్ 912 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1లో.. జో రూట్ 897 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం టెస్టుల్లో అరంగేట్రం చేసిన లబూషెన్ ఇప్పటివరకు 20 టెస్టులు మాత్రమే ఆడాడు. కోహ్లీ, స్మిత్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్లను సైతం దాటేసి అగ్రస్థానం అందుకోవడంతో మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

3 / 6
లబూషెన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతడి సగటు 62.14. కనీసం 20 టెస్టులు ఆడిన బ్యాట్స్‌మెన్ల పరుగుల సగటులో డాన్ బ్రాడ్‌మాన్‌ తర్వాత లబూషెన్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. 2014లో లబూషెన్ బ్రిస్బేన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా దిగాడు. ఇక అక్టోబర్ 2018లో పాకిస్థాన్‌తో జరిగిన దుబాయ్ టెస్టు ద్వారా లబూషెన్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే రెండో బంతికి ఔటయ్యాడు. ఇక రెండవ ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేశాడు. ఈ సిరీస్ తర్వాత లబూషెన్ టెస్ట్ ర్యాంకింగ్ 110వ స్థానంలో నిలిచాడు.

4 / 6
ఆ తర్వాత 2018లో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో ఆడిన మార్నస్ లబూషెన్ 38, 81 పరుగులు చేసి టెస్ట్ ర్యాంకింగ్‌లో 95వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 2019 యాషెస్ సిరీస్‌లో, లార్డ్స్ టెస్టులో కంకషన్ సబ్‌స్టిట్యుట్‌గా స్టీవ్ స్మిత్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 59 పరుగులతో రాణించాడు.

5 / 6
యాషెస్ సిరీస్‌లో, లబూషెన్ 50.42 సగటుతో నాలుగు అర్ధశతకాలు బాదాడు. ఈ ప్రదర్శనతో అతడు ర్యాంకింగ్‌లో 35వ స్థానానికి ఎగబాకాడు. దీని తర్వాత లబూషెన్ కెరీర్ పీక్స్‌కు చేరింది. 2019-20 పాకిస్తాన్ పర్యటనలో 185, 162 పరుగులు చేయగా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై 143 పరుగులు చేశాడు. 2019లో, అతడి టెస్ట్ సగటు 20.25 కాగా, ఇది జనవరి 2020 నాటికి 63.43కి పెరిగింది. దీంతో లబూషెన్ ర్యాంకింగ్‌లో సరాసరి మూడో స్థానానికి చేరుకున్నాడు.

6 / 6
2020 చివరిలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. అప్పుడు లబూషెన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సిడ్నీ టెస్టులో 91, 73 పరుగులు చేశాడు. అలాగే బ్రిస్బేన్‌లో సెంచరీ సాధించాడు. అయితే ఆ సిరీస్ మాత్రం భారత్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లో లబూషెన్ బ్యాట్‌తో మెరవగా.. రూట్‌ను అధిగమించి అనూహ్యంగా టెస్టుల్లో లబూషెన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.