Aus Vs Sa
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ రెండు రోజుల్లోనే 34 వికెట్లు నేలకూలాయి. ఈ సమయంలో, రెండు జట్లలో మొత్తం 10 మంది బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు.
బ్రిస్బేన్ టెస్టులో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన 10 మంది బ్యాటర్లలో నాథన్ లియాన్‌తో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్ , ట్రావిస్ హెడ్‌లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో ఎన్రిచ్ నార్కియా 2 సార్లు, రాసి వాన్ డెర్ డస్సెన్, ఖయా జోండో, కైల్ వెరీన్ , మార్కో జాన్సెన్ ఇలా మొత్తం ఆరుగురు సున్నాకే వెనుదిరిగారు.
దక్షిణాఫ్రికా తరఫున ఎన్రిచ్ నార్కియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే అవుటయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకి ఔట్ అయిన రెండో ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్‌గా ఖయా జోండో నిలిచాడు. అదే సమయంలో, రాసి వాన్ డెర్ డస్సెన్, కివ్ వెరీన్, మార్కో జాన్సన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యారు