Asian Games 2023: చరిత్ర సృష్టించిన యశస్వీ జైస్వాల్.. గిల్, రైనా రికార్డులు బ్రేక్.. తొలి సెంచరీతోనే ఆ లిస్టులో అగ్రస్థానం..
Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ క్రికెట్ జట్టు సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టీమిండియా మార్గం సుగమమైంది. ఇక ఈ విజయంలో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆసియా క్రీడల్లో భారత్‌కి తొలి సెంచరీ, తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలి టీ20 శతకాన్ని సాధించాడు. అంతే కాదు.. శుభమాన్ గిల్, సురేష్ రైనా పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.