
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగక ముందు 2023 కాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.

అయితే టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో కోహ్లీని అధిగమించాడు. తద్వారా 2023లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శుభమాన్ అవతరించాడు.

2023 కాలెండర్ ఇయర్ ఇంకా మిగిలే ఉన్నా.. ఈ ఏడాదిలో కోహ్లీ ఇప్పటివరకు 5 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. మరోవైపు శుభమాన్ బంగ్లాదేశ్‌పై చేసిన సెంచరీతో ఈ ఏడాది 6వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

ఇలా 2023 కాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా ప్లేయర్ టెంబా బావుమా మూడో స్థానంలో ఉన్నాడు

టెంబా బావుమా 2023 కాలెండర్ ఇయర్‌లో 4 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అతనితో పాటు డెవాన్ కాన్వే(న్యూజిలాండ్), డెరిల్ మిచెల్(న్యూజిలాండ్), నజ్ముల్ హుసేన్ షాంటో(బంగ్లాదేశ్) కూడా ఈ ఏడాదిలో 4 సెంచరీలు చేశారు.