R Ashwin-R Jadeja: 48 టెస్టుల్లోనే 495 వికెట్లు.. రెండో ప్రమాదకర జోడీగా ఆశ్విన్-జడేజా.. మొదటి స్థానానికీ గండం..

|

Jul 16, 2023 | 8:26 PM

Indian Test Pair Bowlers: క్రికెట్ ఫార్మాట్ ఏదైనా.. రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజా ప్రత్యర్థులపై చెలరేగే సత్తా ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఈ ఇద్దరూ అత్యంత ప్రమాదకర జోడీగా అవతరించారు. ఇంకా టెస్టుల్లో కుంబ్లే-శ్రీనాథ్, ఆశ్విన్-ఉమేష్, హర్భజన్-జహీర్ జోడీలను అధిగమించి భారత్ తరఫున రెండో ప్రమాదకర జోడీగా అవతరించారు. అదెలా అంటే..?

1 / 7
R Ashwin-R Jadeja: భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పోటీ పడి మరీ కంగారులను కంగారు పెట్టించారు. ఆ సిరీస్‌లో ఆశ్విన్ 25 వికెట్లు తీసుకుని 86 పరుగులు చేయగా.. జడేజా 22 వికెట్లు తీసి, 135 రన్స్ సాధించాడు.

2 / 7
అలాగే కలిసి ఆడిన ప్రతి టెస్టులోనూ తమదైన ఆటతీరును కనబరుస్తూ మెరుగ్గా రాణిస్తున్న ఈ ఇద్దరి జోడి.. వెస్టిండీస్‌ టెస్టులోనూ మెరిసింది. తొలి టెస్టులో అశ్విన్ 12, జడేజా 5 వికెట్లు తీసుకున్నారు. ఇలా కలిసి ఆడిన 48 టెస్టుల్లోనే ఈ జోడీ ఏకంగా 495 వికెట్లు పడగొట్టింది.

3 / 7
ఇది 400 వికెట్లు అందుకున్న ఏ జోడీ కంటే అయినా అత్యంత వేగవంతమైనది కూడా కావడం విశేషం. అలాగే ఈ క్రమంలో ఆశ్విన్-జడేజా జోడీ 495 వికెట్లను పడగొట్టడం ద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత జోడీగా అవతరించింది.

4 / 7
ఆశ్విన్-జడేజా కంటే ముందు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ జోడీ అగ్రస్థానంలో ఉంది. వీరిద్దరూ 54 మ్యాచ్‌ల్లో కలిసి ఆడి ఏకంగా 501 వికెట్లు తీశారు.విశేషం ఏమిటంటే.. కుంబ్లే-హర్భజన్‌ జోడీ రికార్డును అధిగమించేందుకు అశ్విన్-జడేజా జంట ఎంతో దూరంలో లేరు.

5 / 7
ఈ లిస్టు మూడో స్థానంలో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ జోడీ ఉంది. వీరిద్దరూ కలిసి 59 మ్యాచ్‌ల్లో ఆడి 474 వికెట్లు పడగొట్టారు.

6 / 7
ఇంకా రవిచంద్రన్ ఆశ్విన్-ఉమేష్ యాదవ్ జంట 52 మ్యాచ్‌ల్లో కలిసి 431 వికెట్లను తీసుకుంది.

7 / 7
ఈ లిస్టులో అనిల్ కుంబ్లే-శ్రీనాథ్ జోడీ కూడా ఉంది. ఈ జోడి 52 మ్యాచ్‌ల్లో 412 వికెట్లను తీసింది.