
ODI World Cup 2023 schedule: ఎంతో మంది ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ 50 ఓవర్ల టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత జట్టు తన ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.

అయితే అంతకు ముందు టీమిండియా 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అన్ని జట్లు తలా 2 వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

దీని ప్రకారం సెప్టెంబర్ 30న టీమిండియా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరిగే ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.

అక్టోబర్ 3న టీమిండియా రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తిరువనంతపురంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఎంపికైన అగ్రశ్రేణి జట్టుతో తలపడనుంది. టీమిండియా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1- భారత్ vs ఆస్ట్రేలియా (అక్టోబర్ 8) ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై.

2- భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ (అక్టోబర్ 11) అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.

3- భారత్ vs పాకిస్థాన్ (అక్టోబర్ 15), నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.

4- భారతదేశం vs బంగ్లాదేశ్ (అక్టోబర్ 19), MCA స్టేడియం, పూణే.

5- భారత్ vs న్యూజిలాండ్ (అక్టోబర్ 22), HPCA స్టేడియం, ధర్మశాల.

6- ఇండియా vs ఇంగ్లండ్ (అక్టోబర్ 29), ఎక్నా క్రికెట్ స్టేడియం, లక్నో.

7- భారత్ vs క్వాలిఫైయర్ 2వ ప్లేస్ టీమ్ (నవంబర్ 2), వాంఖడే స్టేడియం, ముంబై.

8- భారత్ vs సౌతాఫ్రికా (నవంబర్ 5), ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా.

9- భారత్ vs క్వాలిఫైయర్ (నవంబర్ 11), ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు.