IPL 2008-2023: అన్ని సీజన్లలోనూ ఐపీఎల్ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

|

May 04, 2023 | 5:27 PM

IPL 2008-2023: ఐపీఎల్ అనేది భారతీయ యువ క్రికెర్లకు వరం కంటే ఎక్కువ. ఒక్క సీజన్‌లో మెరుపులు మెరిపించినా టీమిండియాలో స్థానం పొందడానికి అవకాశం లభించినట్లే. అలాగే కదా.. ఇప్పుడున్న టీమిండియా ప్లేయర్లు జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నది. అలా అవకాశం అందిపుచ్చుకుని టీమిండియా తరఫున ఆడి, రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్ క్రికెట్‌లో తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు కూడా ఆడుతూనే ఉన్న ప్లేయర్లు కూడా ఉన్నారు. అసలు ఆ ఆటగాళ్లు ఎవరు..? ఏయే టీమ్స్ తరఫున ఆడారు..? ఆ వివరాలు తెలుసుకుందాం..

1 / 8
విరాట్ కోహ్లీ: ఐపీఎల్ తొలి సీజన్(2008) నుంచి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడిన కింగ్ కోహ్లీ ఇప్పటికీ ఆ టీమ్‌ కోసమే ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడిన ఒకే ఒక్క ఆటగాడు, ఒక్క టీమ్ తరఫున ఎక్కువ టోర్నీలు ఆడిన ఫ్లేయర్‌గా కోహ్లీ మాత్రమే ఉండడం గమనార్హం.

2 / 8
రోహిత్ శర్మ: 2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున తన ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అన్ని సీజన్లు ఆడిన ఆటగాడు. ఐపీఎల్ తొలి 3 సీజన్లు డెక్కన్ చార్జర్స్ కోసం ఆడిన హిట్ మ్యాన్ తర్వాత ముంబై ఇండియన్స్ శిబిరంలోకి వచ్చాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ 5 సార్లు టోర్నీ విజేతగా నిలిచింది.

3 / 8
ఎంఎస్ ధోని: ధోని కూడా అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆడాడు. మొదటి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు ధోని. అయితే చెన్నై టీమ్ ఐపీఎల్ నిషేధాన్ని ఎదుర్కొన్న రెండు సీజన్లలో ధోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ తరఫున ఆడాడు. ఆ రెండు సీజన్ల తర్వాత ధోని మళ్లీ సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగుతూ ఐపీఎల్‌లో తన 16వ సీజన్ అడుతున్నాడు.

4 / 8
శిఖర్ ధావన్: ఢిల్లీ క్యాపిటల్స్(డేర్ డెవిల్స్) తరపున 2008లో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన శిఖర్ ధావన్ కూడా అన్ని సీజన్లలో ఆడుతున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లలో భాగమయ్యాడు. ఇక తాజాగా జరగుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

5 / 8
దినేశ్ కార్తీక్: ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తన కెరీర్‌ని 2008లోనే ఢిల్లీ క్యాపిటల్స్(డేర్ డెవిల్స్) తరఫున ప్రారంభించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు మళ్లీ ఆర్‌సీబీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్‌గా కొనసాగుతున్నాడు.

6 / 8
వృద్ధిమాన్ సాహా: 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున తన ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభించిన వృద్ధిమాన్ సాహా కూడా 16 సీజన్లలో అడుతూ వచ్చాడు. సాహా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు.

7 / 8
మనీష్ పాండే: ఐపీఎల్ తొలి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మనీష్ పాండే కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తర్వాత పాండే ఆర్‌సీబీ, పూణే వారియర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. కాగా, తాజా ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్‌గా ఆడుతున్నాడు.

8 / 8
ఐపీఎల్ క్రికెట్‌లో మరో విశేషమేమింటే.. 2008 నుంచి 2023 వరకు అన్నీ టోర్నీలు ఆడిన ఏడుగురిలో  అందరూ టీమిండియా ప్లేయర్లే. ఇంకా ఈ జాబితాలో ఒక్క విదేశీ ఆటగాడు కూడా లేడు.