T20 World Cup: తొలిసారి ప్రపంచకప్‌ బరిలో 7గురు భారత ఆటగాళ్లు.. పాకిస్తాన్ మ్యాచుతో 4గురి ప్రయాణం మొదలు.. వారెవరంటే?

|

Oct 17, 2021 | 3:19 PM

ఐపీఎల్ 2021 ముగిసిందన నిరాశ పడుతోన్న క్రికెట్ ప్రేమికులకు టీ20 ప్రపంచ కప్ రూపంలో మరో టోర్నమెంట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సారి ప్రపంచకప్‌లో టీమీండియా నుంచి 7 గురు ఆటగాళ్లు తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు.

1 / 8
టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. అందులో 7గురు ఈ టోర్నమెంట్‌లో మొదటిసారి పాల్గొనబోతున్నారు. వీరి అరంగేట్రం ఐసీసీ టి 20 ప్రపంచకప్ 2021 లో కనిపిస్తుంది. ఇందులో 4 గురు అక్టోబర్ 24 న పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్ నుంచి తమ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు. మొదటిసారిగా టీ 20 ప్రపంచకప్ జట్టులో భాగమైన ఆ 7గురిని చూద్దాం.

2 / 8
కేఎల్ రాహుల్: భారతదేశం తరపున 49 టీ20 లు ఆడిన తర్వాత కుడి చేతి బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మొదటిసారిగా టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమయ్యాడు. ఇటీవలి రాహుల్ ఫాం అద్భుతంగా ఉంది. ఐపీఎల్ 2021 విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. 13 మ్యాచ్‌లలో 6 అర్ధ సెంచరీలతో 626 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభించడమే కాకుండా మిడిల్ ఆర్డర్‌లోనూ బరిలోకి దిగే సత్తా ఉంది. ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన యూఏఈ పిచ్‌లపై రాహుల్ ఆడిన తీరును గమనిస్తే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడిని రోహిత్ శర్మకు ప్రారంభ భాగస్వామిగా చేసేందుకు అవకాశం ఉంది.

3 / 8
రిషబ్ పంత్: ప్రతి ఫార్మాట్‌లోనూ టీమిండియా విశ్వసనీయ వికెట్ కీపర్‌గా మారుతున్న రిషబ్ పంత్, తన మొదటి టీ 20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతను భారతదేశం కోసం 33 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2021 లో పంత్ 3 హాఫ్ సెంచరీలతో 419 పరుగులు చేశాడు. వికెట్ ముందు, వెనుక అతనికి ఉన్న అనుభవం మేరకు పాకిస్తాన్‌పై ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ కోహ్లీకి మొదటి ఎంపిక కావచ్చు.

4 / 8
సూర్య కుమార్ యాదవ్: సూర్యకుమార్ యాదవ్ ఒక కుడి చేతి బ్యాట్స్‌మెన్. అంతర్జాతీయ స్థాయిలో కేవలం 4 టీ 20 మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉన్నాడు. అనుభవం మాత్రం ఎక్కువగా లేదు. అయితే అతనిలో ఎంతో సామర్థ్యం ఉంది. తన తొలి టీ 20 ప్రపంచకప్‌ని ఇంత త్వరగా ఆడే అవకాశం రావడానికి ఇదే కారణం. పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా, మిడిల్ ఆర్డర్‌లో టీమిండియా మొదటి ఎంపిక సూర్యకుమార్ కావచ్చు. ఐపీఎల్ 2021 లో 14 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ 317 పరుగులు చేశాడు. ఐపీఎల్ ద్వితీయార్థంలో, అతను ఖచ్చితంగా తన ఫామ్‌తో పోరాడుతున్నట్లు కనిపించాడు. కానీ, ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌కి తిరిగి వచ్చాడు.

5 / 8

6 / 8
వరుణ్ చక్రవర్తి: ఐపీఎల్ 2021 లో వరుణ్ చక్రవర్తి 18 వికెట్లు సాధించాడు. మోర్గాన్ మాటల్లో చెప్పాలంటే, వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌లో అతిపెద్ద ఆవిష్కరణగా పేర్కొన్నాడు. వరుణ్ చక్రవర్తి భారతదేశం తరపున 3 టీ 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇప్పుడు తన మొదటి టీ 20 ప్రపంచకప్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. పాకిస్థాన్‌పై భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది.

7 / 8
రాహుల్ చాహర్: భారతదేశం కోసం 5 టీ 20 లు ఆడిన రాహుల్ చహర్, తన మొదటి టీ 20 ప్రపంచ కప్ కూడా ఆడతారు. అతను ఐపీఎల్ 2021 లో 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.

8 / 8
శార్దూల్ ఠాకూర్: అంతర్జాతీయ పిచ్‌లో భారత్ తరఫున 22 టీ 20 లు ఆడిన శార్దూల్ ఠాకూర్ ఈసారి తన మొదటి టీ 20 ప్రపంచకప్‌ ఆడనున్నాడు. ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్‌లో  అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు.