IND vs NZ: టీమిండియా స్వ్కాడ్ ప్రకటనతో ఈ నలుగురి కెరీర్‌ క్లోజ్.. ఇక రిటైర్మెంటే?

Updated on: Oct 17, 2026 | 5:15 PM

Team India Players May Retirement:న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటనతో నలుగురు సీనియర్ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జయదేవ్ ఉనద్కట్, సారాంశ్ జైన్‌లకు జట్టులో చోటు దక్కలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం లభించడంతో, ఈ ఆటగాళ్లకు రిటైర్మెంట్ ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

1 / 6
భారత జట్టు (Team India) న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) తొలుత టీ20 జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం నాడు వన్డే, టెస్టు జట్లను కూడా ప్రకటించింది. ఈ జట్లలో పలువురు ఆటగాళ్లకు తిరిగి చోటు దక్కగా, అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని కొందరికి కూడా అవకాశం లభించింది. కొత్త ఆటగాడిగా కుమార్ కుశాగ్రకు పిలుపు రావడం విశేషం.

2 / 6
ఈ పర్యటనలో జరగనున్న 12 మ్యాచ్‌ల కోసం ఆటగాళ్ల ఎంపికతో భవిష్యత్తులో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశమున్న ఆటగాళ్లు ఎవరో కొంత స్పష్టత వచ్చింది. అదే సమయంలో, భారత జట్టులో కొందరి కెరీర్‌కు దాదాపుగా ముగింపు పడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తప్ప మరో మార్గం లేని నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

3 / 6
1. మహమ్మద్ షమీ: 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహమ్మద్ షమీకి ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. గాయాల కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన ఆయన, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. న్యూజిలాండ్ పర్యటనతో షమీ తిరిగి జట్టులోకి వస్తారని అంచనాలు ఉన్నప్పటికీ, ప్రగ్యాన్ ఓజా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయనను ఎంపిక చేయలేదు. దీంతో 36 ఏళ్ల షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

4 / 6
2. ఇషాంత్ శర్మ: అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా ఏళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆయన జట్టులో చోటు కోల్పోయాడు. అయినప్పటికీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. న్యూజిలాండ్ పర్యటన కోసం యువ ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేయడంతో 38 ఏళ్ల ఇషాంత్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

5 / 6
3. జయదేవ్ ఉనద్కట్: 34 ఏళ్ల జయదేవ్ ఉనద్కట్ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో దక్షిణాఫ్రికా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన, 16 ఏళ్లలో కేవలం 22 మ్యాచ్‌లే ఆడాడు. 2023లో టీమిండియా తరపున చివరిసారిగా బరిలోకి దిగాడు. అప్పటి నుంచి సౌరాష్ట్రకు చెందిన ఈ సీనియర్ బౌలర్‌కు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం రాలేదు. న్యూజిలాండ్ పరిస్థితులు ఉనద్కట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, సెలక్టర్లు ఆయనకు బదులుగా యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచారు.

6 / 6
4. సారాంశ్ జైన్: ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ కోసం టీమిండియాకు ఎంపిక చేశారు. రెండో టెస్టులో ఆడిన ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో భవిష్యత్తులో భారత జట్టులో ఆయనకు అవకాశాలు దక్కడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు ప్రకటించిన జట్లలో కూడా సారాంశ్‌కు చోటు దక్కలేదు. వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్న నేపథ్యంలో సారాంశ్‌కు భవిష్యత్తులో అవకాశాలు లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను బట్టి చూస్తే, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే చివరి మ్యాచ్ ఆడేశాడనే చర్చ జరుగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us