
కందిపప్పుతో చేసే ఏ వంటకాలు అయినా సరే చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటాయి. అయితే చాలా మంది దీనితో వంటలు చేయాలి అన్నా ఇది లేటుగా ఉడుకుతుంది అనే భయంతో ఎక్కువగా వండటానికి ఆసక్తి చూపరు. మరి కందిపప్పు త్వరగా ఎలా ఉడుకుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ చిట్కాలు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కందిపప్పును చాలా త్వరగా ఉడకబెట్టవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి.

కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే ముందుగా దానిని వేడి నీటిలో నానబెట్టాలి. వేడి నీటిలో నానబెట్టడం వలన పప్పు మెత్తగా ఉడుకుతుంది. వేడి గోరు వెచ్చటి వేడి నీటిలో పది హేను నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టడం వలన పప్పు త్వరగా మెత్తబడుతుంది. మీరు కర్రీ ప్రిపేర్ చేసే సమయంలో వంట చాలా త్వరగా పూర్తి అవుతుంది.

చాలా మంది కంది పప్పును నార్మల్‌గా ఉడకబెడుతూ ఉంటారు. అయితే కుక్కర్‌లో మీరు పప్పు ఉడకబెట్టే సమయంలో చిటికెడు పసుపు, నూనె వేయడం చాలా మంచిది. దీని వలన అది త్వరగా ఉడకడమే కాకుండా, రుచి బాగుంటుంది. చాలా మెత్తగా అవుతుంది. పప్పు పొంగి పోకుండా ఉంటుందంట.

అలాగే పప్పును కుక్కర్‌లో ఉడకబెట్టే సమయంలో తప్పకుండా సరైన కొలతల ద్వారా ఉడకబెట్టాలంట. మూడు కప్పుల నీటికి ఒక కప్పు కంది పప్పు వేయాలి. ఇలా ఉడకబెట్టడం వలన చాలా త్వరగా ఉడుకుతంది. సరిగ్గా సరిపోతుంది.

అలాగే కొంత మంది పప్పు త్వరగా ఉడకాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా అందులో సోడా వేయడం లాంటిది చేస్తుంటారు. కానీ అలా సోడా వంటివి వేయకుండదు. వంట సోడా వంటివి వేయడం కంటే, కొబ్బరి నూనె టీ స్పూన్ వేయడం చాలా మంచిదంట.