హంస అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అది పాలను నీటిని వేరు చేస్తుంది అని. మరి నిజంగానే హంస పాలను నీటిని వేరు చేస్తుందా?
హంస
భారతీయ సంసృతి, పురాణాలలో హంసలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పాలలో నీటిని కలిపి దాని ముందు ఉంచితే అది నీటిని వదిలేసి పాలను మాత్రమే తాగుతుంది అంటారు.
భారతీయ సంస్కృతి
మరి ఇది నిజంగా నిజమేనా? లేదా అపోహనా? ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.
నిజమా? అపోహనా?
ఆధునిక శాస్త్రం ప్రకారం, హంస పాలను నీటిని వేరు చేస్తుంది అనేది నూటికి నూరు శాతం పౌరాణికం మాత్రమే అంటున్నారు నిపుణులు. నీటిని పాలను వేరు చేసే శక్తి దేనికి లేదంట.
ఆధునిక శాస్త్రం
మనం చెడు విడిచి పెట్టి, మంచిని మాత్రమే గ్రహించాలి అనే సూత్రాన్ని తెలియజేయడానికి పూర్వీకులు ఈ విధంగా తెలియజేశారు. కానీ దీనికి ఆధారాలు ఏం లేవంట.
చెడును వదిలి మంచిని స్వీకరించడం
అంతే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా హంస పాలను, నీటిని వేరు చేస్తుందనే ఆధారాలు లేవు అని చెబుతున్నారు నిపుణులు.
శాస్త్రీయ పరంగా
హంస నీటిలో ఉన్న చిన్న చిన్న నాచు, పురుగులు, మొక్కలను ముక్కుతో వడకట్టి తింటుంది. దానిలో జల్లెడ వంటిది ఉంటుంది. దీంతో నీళ్లు పక్క నుంచి వెళ్లిపోతాయి, ఆహారం మాత్రమే నోట్లో ఉంటుంది
జల్లెడ వంటి స్వభావం
దాన్ని చూసి పూర్వకాలం కవులు నీటి నుంచి పాలను వేరు చేస్తున్నట్ట వర్ణించారు కానీ నిజానికి హంస పాలను నీటిని వేరు చేయదంట.