Alcohol with Soft Drinks: మద్యంలో కూల్‌ డ్రింక్‌ కలుపుకుని తాగేస్తున్నారా? మీ ఒంట్లో జరిగేదిదే..

Updated on: Mar 21, 2026 | 7:30 PM

వేడుకలు, పార్టీలు.. సందర్భం ఏదైనా అక్కడ ఆల్కహాల్‌ ఉండాల్సిందే. సాధారణంగా మందుబాబులు మద్యంను శీతల పానీయాలు, సోడా లేదా పండ్ల రసంలో కలుపుకుని సేవిస్తుంటారు. ఈ మిశ్రమం రుచిగా ఉంటుందని, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5
వేడుకలు, పార్టీలు.. సందర్భం ఏదైనా అక్కడ ఆల్కహాల్‌ ఉండాల్సిందే. సాధారణంగా మందుబాబులు మద్యంను శీతల పానీయాలు, సోడా లేదా పండ్ల రసంలో కలుపుకుని సేవిస్తుంటారు. ఈ మిశ్రమం రుచిగా ఉంటుందని, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంపై అనేక తీవ్రమైన మరియు దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయట.

2 / 5
కూల్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్ రెండూ మూత్రవిసర్జనను ప్రేరేపించేవి కాబట్టి, శరీరంలోని నీటి పరిమాణం వేగంగా తగ్గిపోతుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీనివల్ల అలసట, తలనొప్పులు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చల్లని పానీయాలు, జ్యూస్‌లలో ఉండే అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం.

3 / 5
ఈ కలయిక వలన మత్తు త్వరగా పెరిగి, వ్యక్తి నియంత్రణ కోల్పోయి సాధారణం కంటే ఎక్కువగా మద్యం తాగుతాడు. ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫీన్ గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవచ్చు.

4 / 5
నీటితో కలిపిన మద్యం తాగడం వల్ల కలిగే హాని చాలా తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బదులుగా శీతల పానీయాలు, జ్యూస్‌లో కలపడం వల్ల త్వరగా మత్తు ఎక్కుతుందట. కానీ ఇది కాలేయం, గుండె, జీర్ణవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఈ మిశ్రమం తాత్కాలిక ఆనందాన్ని అందించినప్పటికీ దాని వల్ల కలిగే ఆరోగ్య నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది.

5 / 5
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరిగా తాగాల్సి వస్తే నీటిని లేదా తక్కువ చక్కెర ఉన్న మిశ్రమాన్ని ఉపయోగించాలి. శరీరంలో నీటి స్థాయిని కాపాడుకోవడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి.

Follow Us