సిద్దిపేట బహిరంగ సభ నుంచి హైదరాబాదుకు వస్తూ మార్గ మధ్యలోని సోనీ ఫ్యామిలీ దాబాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాయ్ తాగారు. కొన్ని నిమిషాల పాటు కాన్వాయ్ ను ఆపిన సీఎం కేసీఆర్ టీ తాగుతూ సేద తీరారు.. సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో మాట్లాడుతూ.. కాసేపు గడిపారు.