
రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ అరంగట్రం చేసింది సొగసరి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. తన అందం, సొగసు చూపి తెలుగు కుర్రాళ్ల క్రాష్ లిస్ట్‌లో చేరిపోయింది ఈ బ్యూటీ.

దింతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం వాటిలో ఒకటి విజయ్ దేవరకొండకి జోడిగా నటించిన కింగ్డమ్ మూవీ షూటింగ్ కంప్లైట్ అయింది. ఇది ఈ ఏడాది జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే దుల్కర్ సల్మాన్ సరసన కాంత అనే పీరియడ్ డ్రామా సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోన్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

వీటితో పాటు రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కథానాయికగా నటిస్తుంది భాగ్యశ్రీ. బయోపిక్ అఫ్ ఫ్యాన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు పి. మహేష్ బాబు.

చేతిలో ఉన్న ఈ మూడు సినిమా కంప్లీట్ అవ్వకముందే ప్రభాస్ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఆది ఏ సినిమా అన్నది క్లారిటీ లేదు. ఇది నిజమైతే భాగ్యశ్రీ స్టార్ అయిపోవడం పక్క. చూడాలిక టాలీవుడ్లో ఈమె జర్నీ ఎలా సాగనుందో.