Who is the No. 1 Heroine: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో నెంబర్.1 హీరోయిన్ ఎవరు? రేసులో నుంచి వారు ఔట్..

|

Dec 03, 2022 | 9:29 PM

టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్న అడిగేముందు.. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నెంబర్.1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే..

1 / 8

2 / 8
ఇండస్ట్రీలో నెంబర్.2 కాస్తా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితేంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజుకో కొత్త ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తున్నా.

3 / 8
టాలీవుడ్‌కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. ఉన్న హీరోయిన్లు సరిపోరు.. కొత్త హీరోయిన్లు స్టార్స్‌కు సెట్ అవ్వరు.. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెంబర్ వన్ అనుకున్న పూజా హెగ్డేకు మహేష్ బాబు సినిమా తప్ప మరో ఆఫర్ లేదు.

4 / 8
విజయ్ దేవరకొండతో కమిటైన జనగణమన ఆదిలోనే ఆగిపోయింది. బాలీవుడ్‌లో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు పూజా. తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న పూజా హెగ్డేను నెంబర్ వన్ అనలేం.

5 / 8
ఇక రష్మిక మందన్న సైతం టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసారు. పుష్ప 2 మినహా.. ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు. రష్మిక చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయి. అక్కడే వరస సినిమాలు చేస్తున్నారు. దాంతో టాలీవుడ్ నెం.1 హీరోయిన్ రేసులో నుంచి రష్మిక బయటికి వచ్చేసినట్లే..

6 / 8
ఇక కియారా అద్వానీ సైతం రామ్ చరణ్ సినిమా సైన్ చేశారు. ఎన్టీఆర్, కొరటాల సినిమాలోనూ కియార పేరు పరిశీలిస్తున్నారు. అందులోనూ ఓకే అయితే.. అప్పుడు టాప్ హీరోయిన్స్ రేసులోకి కియారా వస్తారు. లేదంటే ఆమె ఈ రేసులో లేనట్లే..

7 / 8
ఇక సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. వీరు ముగ్గురూ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో లేనట్లే పరిగణించాలి.

8 / 8
మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి లాంటి బ్యూటీస్ స్టార్స్‌కు దూరంగానే ఉన్నారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ పీఠం మరికొన్నిరోజులు ఖాళీగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెం.1 హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే..