
బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేణు షార్ట్ గ్యాప్‌లోనే మరో ఇంట్రస్టింగ్ మూవీని రెడీ చేశారు. నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమాను పట్టాలెక్కించాలని ట్రై చేశారు. తాజాగా ఈ సినిమా విషయంలో ఇంకా వెయిటింగ్ తప్పదని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు.

ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ వర్క్ స్టార్ట్ చేసిన చరణ్, ఆ సినిమాను పూర్తి చేయడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో నెక్ట్స్ చేయాల్సిన సినిమాలు డిలే అవుతున్నాయి. చాలా రోజులుగా చరణ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ ఎప్పుడు రెడీ అంటారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది.

రెగ్యులర్‌గా హీరోలు, నిర్మాతలు దర్శకులను వెయిటింగ్‌లో పెడితే, జక్కన్న విషయంలో పరిస్థితి మరోలా ఉంది. మహేష్ చాలా రోజులుగా సెట్‌కు వచ్చేందుకు రెడీ అంటున్నా... జక్కన్న మాత్రం ప్రీ ప్రొడక్షన్‌కు మ్యాగ్జిమమ్ టైమ్ తీసుకుంటూ మహేష్‌ను వెయిటింగ్‌లో పెట్టారు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక పవర్ స్టార్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా హరి హర వీరమల్లు షూటింగ్ రీ స్టార్ట్ చేశారు పవన్. ఓజీ కూడా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

కానీ హరీష్ శంకర్‌కు మాత్రం మరి కొద్ది రోజులు వెయిటింగ్ తప్పేలా లేదు. ఈ సినిమాలు పూర్తయితే కొత్త సినిమాలు స్టార్ట్ చేసేందుకు సురేందర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా లైన్‌లో ఉన్నారు.