
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ రెండు పేర్లు పక్కపక్కన బెడితే చాలు ఏదో తెలియని వైబ్రేషన్ అయితే వస్తుంది. వీళ్లు కలిసి నటించింది రెండు సినిమాలే గానీ.. వాళ్ళ కెమిస్ట్రీ మాత్రం నెక్ట్స్ లెవల్. ఇద్దరి మధ్య కచ్చితంగా సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ చాలా రోజులుగా వార్తలొస్తూనే ఉన్నాయి.. కానీ వాళ్ళు మాత్రం నవ్వుతూనే సమాధానం దాటవేస్తారు.

గీత గోవిందంలో నటించినప్పటి నుంచే విజయ్, రష్మిక మంచి స్నేహితులు.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌తో ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. హైదరాబాద్ వచ్చినపుడు విజయ్ ఫ్యామిలీని కలిసేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉంది. అలాగే ఇద్దరి సినిమాలు విడుదలైనపుడు.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు.

మొన్న కుబేరా సినిమా విడుదలైనపుడు రష్మిక పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేసారు విజయ్. అంతేకాదు.. ఆ మధ్య కింగ్డమ్ టీజర్ విడుదలైనపుడు.. పాట వచ్చినపుడు రష్మిక కూడా మరిచిపోకుండా రౌడీ బాయ్‌కు విషెస్ చెప్పారు.

స్పెషల్ డేస్ ఏవి వచ్చినా కూడా మరిచిపోకుండా చాలా ప్రేమతో విష్ చేసుకుంటారు ఈ ఇద్దరూ.తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం రష్మిక కొత్త సినిమా మైసా. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు విజయ్.

అంతేకాదు.. రష్మిక నటిస్తున్న గాళ్ ఫ్రెండ్ సినిమాకు వాయిస్ కూడా ఇచ్చారు విజయ్. మొత్తానికి తమ మధ్య ఏం లేదని చెప్పట్లేదు కానీ ఏదో ఉందని కూడా ఒప్పుకోవట్లేదు వీళ్లు. చిన్నసైజ్ దాగుడుమూతలు ఆడుతున్నారు.