Police Story: ఖాకీ డ్రెస్ వేస్తున్న హీరోలు.. పోలీస్ స్టోరీస్‌కు పునర్వైభవం..

|

Feb 05, 2025 | 2:10 PM

హీరో పోలీస్ అయితే.. స్టోరీ వర్కవుట్ అయితే.. బాక్సాఫీస్ బద్ధలే. అందుకే టాలీవుడ్‌లో నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ స్టోరీ అంటే ఖాకీ కథలే. తాజాగా ఈ పోలీస్ స్టోరీస్‌కు పునర్వైభవం వస్తుంది. పెద్దా చిన్నా తేడా లేదు.. అందరూ మళ్లీ ఖాకీ డ్రెస్ వేస్తున్నారు. మరి ఈ మధ్యే వచ్చిన.. ఇప్పుడొస్తున్న.. త్వరలోనే రాబోతున్న ఆ పోలీస్ స్టోరీస్‌పై ఓ లుక్ వేద్దామా..?

1 / 5
టాలీవుడ్‌లో మళ్లీ పోలీస్ బ్యాక్‌డ్రాప్ కథలకి డిమాండ్ పెరుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాంలోనూ వెంకీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. వెంకీ ఖాకీ డ్రెస్ వేసినపుడు 90 శాతం విజయమే వరించింది.

2 / 5
 రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నారు. విక్రమార్కుడు నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు చాలా సినిమాల్లో పోలీస్‌గా రప్ఫాడించారు మాస్ రాజా. రవితేజ పోలీస్ డ్రెస్ వేసారంటే చాలు.. స్క్రీన్ మీద మ్యాజిక్ జరగాల్సిందే. మాస్ జాతరను కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు.

3 / 5
ఇక హిట్ 3లో రూత్ లెస్ కాప్ అర్జున్ సర్కార్‌గా రప్ఫాడించడానికి వచ్చేస్తున్నారు నాని. హిట్ 3 కోసం సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నారు నాని. విజయ్ దేవరకొండ సైతం కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఖాకీ వేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఈయన కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. 

4 / 5
ప్రభాస్‌ను స్పిరిట్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానే చూపించబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  ఈ సినిమా షూటింగ్  స్టార్ట్ అవ్వకముందే  దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో సెట్స్‎పైకి వెళ్లనుంది.

5 / 5
ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ సైతం కాప్‌గానే కనిపిస్తూ అలరించబోతున్నారు. ఆ మధ్య భగవంత్ కేసరిలో కాసేపు కాప్ రోల్‌లో స్క్రీన్ షేక్ చేసారు బాలయ్య. మొత్తానికి మన హీరోల మనసు ఖాకీ వైపు మళ్ళిందిప్పుడు.