
గీత గోవిదం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట, డియర్ కామ్రేడ్ మూవీతో ఫేవరెట్ కపుల్ అయిపోయారు. అప్పుడే వీరి ప్రేమ కూడా మొదలైంది. వీరి కాంబోలో వచ్చిన సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఎప్పుడూ స్పందించలేదు.

ఏకంగా వెడ్డింగ్ కార్డ్ షేర్ చేసి, తమ ప్రేమను వ్యక్తపరుస్తూ, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26 న రాజస్థాన్‌లోని ఉదయ్ పర్ ఐటీసీ మెమోంటో హోటల్లో రెండు సంప్రదాయాల ప్రకారం, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది.

ఇక వివాహం తర్వాత ఈ జంట తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం, ప్రేమ, అభిప్రాయాలను తెలుపుతూ.. పెళ్లి ఫొటోలు షేర్ చేశారు.

అయితే వివాహం జరిగిన వెంటనే ఈ కపుల్ పీఎం మోదీ, అమిత్ షాను కలిసారు. సివిల్ డ్రెస్‌లో ఇద్దరూ వెళ్లి , మొదట కేంద్ర హోమ్ శాఖ మత్రి అమిత్ షాను కలిసి, తమ రిసెప్షన్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

తర్వాత పీఎం మోదీని కలిసి, తన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోదీని తమ రిసెప్షన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.