
ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది. పుష్ప 2 పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఫ్యామిలీమేమన్2 సీరీస్‌లోనూ, యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవతార్‌ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు సామ్. సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారంలోనూ గన్‌తో కనిపించారు.

నార్త్ సిటాడెల్‌లో ఎటూ డిష్యుమ్ డిష్యుమ్‌లు ఉండనే ఉంటాయి. లేటెస్ట్ గా కాజల్ పోలీస్‌గా నటించిన సినిమా సత్యభామ. మే 17న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో పిస్టల్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశారు కాజల్.

ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా నవ్విస్తూనే సాగింది టిల్లు స్క్వేర్. ఇంచ్ బై ఇంచ్ యూత్‌ని అట్రాక్ట్ చేయడంలో క్లిక్ అయింది కాబట్టే కాసుల వర్షం కురిసింది టిల్లు స్క్వేర్ సినిమాకి. సీక్వెల్ ఇచ్చిన జోష్‌తో త్రీక్వెల్‌కి ప్రిపేర్ అవుతున్నారు మేకర్స్.

శ్రుతిహాసన్ ఇప్పుడు డెకాయిట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో శేష్‌కి ఈక్వెల్‌గా శ్రుతి గన్ను పట్టుకుని యాక్షన్‌లోకి దిగేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా స్క్రీన్స్ మీదకు రానుంది. ఆల్రెడీ క్రాక్ సినిమాలోనూ తన యాక్షన్ పవర్‌ని చూపించారు హాసన్ డాటర్.