
త్రిష తెలుగు, తమిళ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో జతకట్టింది. అంతే కాకుండా ఈ బ్యూటీ తన కెరీర్ స్టార్టింగ్ లో వరస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ నే షేక్ చేసింది.

తర్వాత మెల్లిగా కాస్త ఆఫర్స్ తగ్గడంతో కోలీవుడ్, మాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పటి వరకు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మల్లో త్రిషే ముందుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ లో పలు సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్ తో కుర్రకారు మతి పొగొట్టింది.

మెరూన్ కలర్ మోడ్రన్ డ్రెస్ అదిరిపోయింది . కెరీర్ స్టార్టంగ్ లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో ఈ బ్యూటీ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పటికీ అదే అందం, బ్యూటిఫుల్ త్రిష అంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.