
మా సినిమాలో హీరో బిచ్చగాడు అని చెప్పడానికి ఒకప్పుడు దర్శకులు భయపడేవాళ్లేమో గానీ.. బిచ్చగాడు సినిమా హిట్టయ్యాక ఆ భయం పోయింది. అందుకే హీరోలు ధైర్యంగా ఆ పాత్రలు చేస్తున్నారు.

కుబేరలో ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఆయన క్యారెక్టర్ నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేసారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్ సినిమాలో ఉన్నపుడు.. దర్శకుడు ధైర్యంగా ఎలాంటి ప్రయోగమైనా చేసుకోవచ్చు.

కుబేరాలో శేఖర్ కమ్ముల చేసింది ఇదే. ఇక తన హీరోలను రఫ్ అండ్ టఫ్‌గా చూపించే పూరీ జగన్నాథ్.. విజయ్ సేతుపతి కోసం మాత్రం డిఫెరెంట్ క్యారెక్టర్ రాస్తున్నారు. ఇది పూరీ తరహా మాస్ సినిమా కాదు.. విజయ్ స్టైల్‌లో సాగే డిఫెరెంట్ కథ.

విజయ్ సేతుపతి సినిమా 60 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పూరీ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది.. విజయ్ వచ్చేసరికి బౌండెడ్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారు పూరీ. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైపోయింది.

ఇందులో విజయ్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నారని.. అందుకే ఈ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. మురికివాడ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. మొత్తానికి ఇటు ధనుష్.. అటు విజయ్ సేతుపతి ఇద్దరూ ఒకేసారి బిచ్చగాడి పాత్రలు చేస్తున్నారు.