విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ బడ్జెట్ - ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 140 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ సౌత్‌కు పరిచయం అవుతున్నారు.
ఆర్‌సీ 16 కొత్త ఆఫీస్ - గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన చెర్రీ, త్వరలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు మేకర్స్.
నువ్వే కావాలి రీ రిలీజ్ - తరుణ్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ హిట్ నువ్వే కావాలి. రామోజీ రావు, స్రవంతి రవికిశోర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను రీ మాస్టర్ చేసి 4కేలో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
తమిళ దర్శకుడితో నాని - నేచురల్ స్టార్ నాని మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ మూవీ డాన్ ఫేం సిబి చక్రవర్తి దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది. ప్రజెంట్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న హాయ్ నాన్న వర్క్‌లో బిజీగా ఉన్నారు నాని.
2020లోనే డైరీలో రాసుకున్నా- ఇటీవల ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు సాధించిన కృతి సనన్, మూడేళ్ల క్రితమే తాను ఈ విషయాన్ని తన డైరీలో రాసుకున్నాని చెప్పారు. అవార్డు వచ్చినంత మాత్రాన ఏదో సాధించానని అనుకోవటం లేదని, ఇండస్ట్రీలో ఇంకా నేర్చుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉందని చెప్పారు.