నటి సాయిపల్లవి తన కుటుంబ సభ్యులతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. 60 ఏళ్ల తన తల్లిదండ్రులు, దారిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూసి, 'ఇంత దూరంలో ఎందుకున్నావు దేవుడా' అని అనిపించిందని చెప్పారు. అమర్‌నాథ్ పవర్‌ఫుల్ ప్లేస్ అని, ఎన్నో విషయాలను నేర్పిందని, ఈ యాత్ర వల్ల, మనుషులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలన్న విషయం మరోసారి అర్థమైందని అన్నారు సాయిపల్లవి.