Sanghavi: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంఘవి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో! బర్త్ డే ఫొటోస్ వైరల్

Updated on: Jan 12, 2026 | 6:32 PM

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంఘవి తన కూతురు పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు సంఘవి కూతురుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

1 / 6
 దక్షిణాదిలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సంఘవి ఒకరు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 6
 సుమారు పదిహేనేళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో నటించింది సంఘవి. బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసింది.

3 / 6
 తాజ్ మహల్, ఊరికి మొనగాడు, తాత మనవడు, నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, సూర్య వంశం, అబ్బాయి గారి పెళ్లి, సమర సింహారెడ్డి, సింధూరం, సీతారామ రాజు, పిల్ల నచ్చింది, చిరంజీవులు, లాహిరి లాహిరి లాహిరి లాంటి  సూపర్ హిట్ సినిమాలు సంఘవికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

4 / 6
  కాగా 2016లో వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది సంఘవి. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైన ఆమె 
చివరిసారిగా 2019లో కొలంజి అనే తమిళ చిత్రంలో కనిపించింది

కాగా 2016లో వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది సంఘవి. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైన ఆమె చివరిసారిగా 2019లో కొలంజి అనే తమిళ చిత్రంలో కనిపించింది

5 / 6
కాగా పెళ్లయ్యాక చాలా ఏళ్ల వరకు సంఘవికి సంతానం కలగలేదు. చివరకు 2020లో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి సంఘవి వయసు 42 ఏళ్లు కావడం గమనార్హం.

6 / 6
 తాజాగా తన కూతురు ఛాన్వీ ఆరో పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది సంఘవి. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.