
మరోసారి హోస్ట్ అవతారం ఎత్తబోతున్నారు యంగ్ హీరో రానా దగ్గుబాటి. ఆల్రెడీ ఓ డిజిటల్ షోతో పాటు ఫిలిం ఈవెంట్స్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించిన రానా,

ఈ సారి మరో డిఫరెంట్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈషోకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.

మరో డిఫరెంట్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు రానా దగ్గుబాటి. గతంలో నెంబర్ వన్ యారి అనే టాక్ షో చేసిన ఈ యంగ్ హీరో, మళ్లీ అలాంటి షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే ఈ సారి భారీగా నేషనల్ లెవల్‌లో షోను ప్లాన్ చేస్తున్నారు. రెండు సీజన్లుగా వచ్చిన నెంబర్ వన్ యారి సూపర్ హిట్ అయ్యింది.

ఆ తరువాత కొన్ని ఫిలిం ఈవెంట్స్‌లోనూ హోస్ట్‌గా తన మార్క్ చూపించారు రానా. ఇప్పుడు మరోసారి ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తబోతున్నారు.

ది రానా దగ్గుబాటి షో పేరుతో ప్లాన్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఈ నెల 23 నుంచి డిజిటల్‌లో స్ట్రీమ్ కానుంది.

ప్రస్తుతానికి రానా హోస్ట్ చేస్తారన్న ఎనౌన్స్‌మెంట్ మాత్రమే ఇచ్చిన మేకర్స్, షోలో గెస్ట్‌లుగా ఎవరు రాబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, లాంటి విషయాలేవి రివీల్ చేయలేదు.