సునామీలా ముంచేస్తున్న సినిమాలు.. నిండా మునిగిపోతున్న నిర్మాతలు

Updated on: Jun 13, 2025 | 8:34 PM

సంపేత్తే సంపేయండ్రా.. ఇలా టెన్షన్ పెట్టొద్దు అనే డైలాగ్ గుర్తుందా..? బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ బాగా ఎంటర్‌టైనింగ్‌గా చెప్తారు ఈ డైలాగ్. ఇప్పుడిదే మాటను కాస్త మార్చి అంటున్నారు మన నిర్మాతలు.. కాదు కాదు అలా అనేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. ముంచేస్తే మొత్తం ముంచేయడమే.. తేల్చడాలేం లేవు. అసలు ఈ స్టోరీ ఏంటో డీటైల్డ్‌గా ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం పదండి..

1 / 5
ఈ మధ్య ఆడియన్స్ మరీ కఠినంగా మారిపోతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో ఉంటే.. ఎలా ఉన్నా కనీసం మూడు రోజులైనా థియేటర్స్‌కు వచ్చేవాళ్లు. దాంతో ఫ్లాప్ అయినా కూడా నష్టాలు కాస్త తక్కువగానే వచ్చేవి.

2 / 5
కానీ ఇప్పుడలా కాదు.. సినిమా బాగోలేకపోతే మ్యాట్నీ షో నుంచే వాకౌట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే లాసెస్ కూడా భరించలేనంతగా వస్తున్నాయి. గత రెండు మూడేళ్లుగా కొన్ని సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు వింటుంటే.. ఆ నిర్మాతలు, బయ్యర్లను చూసి పాపం అనడం తప్ప ఇంకేం చేయలేం.

3 / 5
తాజాగా థగ్ లైఫ్‌నే తీసుకోండి.. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా రెండో రోజే థియేటర్స్‌లో కనబడలేదు.. జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.. బయ్యర్లు నిండా మునిగిపోయారు.

4 / 5
ఎందుకో తెలియదు గానీ తమిళంలోనే ఇలాంటి కళాఖండాలు ఎక్కువగా వస్తున్నాయి. గతేడాది శంకర్, కమల్ కలయికలో వచ్చిన భారతీయుడు 2 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో..? ఈ ఒక్క సినిమాతో శంకర్ కెరీర్ కూడా మునిగిపోయింది. అలాగే సూర్య కంగువా, రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాలు కూడా అంతే.. వీటి నష్టాలు కూడా వందల కోట్లల్లో ఉన్నాయి.

5 / 5
తెలుగులోనూ నిండా ముంచేసిన సినిమాలు ఈ మధ్య బాగానే వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ 100 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది.. అలాగే ఆచార్య, భోళా శంకర్ నష్టాలు మామూలుగా లేవు. ప్రభాస్ రాధే శ్యామ్‌కు 100 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. ఈ షాకుల నుంచి కోలుకోడానికి నిర్మాతలకు చాలా టైమ్ పట్టింది.. కొందరైతే ఇంకా బయటికి రాలేదు. అలా మొత్తానికి ముంచేస్తున్నాయి కొన్ని సినిమాలు.