Basha Shek |
Jan 07, 2023 | 11:28 AM
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ వర్మ డేటింగ్ వ్యవహారం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 'లాస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ ఇటీవలే న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక బాహుబలి మనోహరి నోరా ఫతేహీ- షారుఖ్ కుమారుడు ఆర్యన్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు కూడా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల వీరి న్యూ ఇయర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు తెగ వైరలయ్యాయి.
ఇక జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. శిఖర్ మరెవరో కాదు.. మహారాష్ట్ర మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.
కింగ్ ఖాన్ షారుఖ్ కూతురు సుహానా, బిగ్ బీ మనవడు అగస్త్య నందా ఏడాది ప్రారంభంలో మరో కొత్త ప్రేమకథకు తెరతీశారు. తమ మొదటి సినిమా 'ది ఆర్చీ' షూటింగ్‌లో వీరు బాగా దగ్గరైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'బుల్బుల్'లో నటించిన తృప్తి డిమ్రీ, నిర్మాత కర్ణేష్ శర్మతో ప్రేమలో మునిగితేలుతున్నారు. కర్ణేష్ మరెవరో కాదు విరాట్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు.