
తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆతర్వాత వరుసగా మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అదే విధంగా తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అందాల తార.

గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ .. రాంబంటు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

గత ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య పేరు మారుమ్రోగింది.

సినిమాలతో ఈ చిన్నది పెద్దగా బిజీగా ఉండటం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. నెటిజన్స్ ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవుతున్నారు.