మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. టుస్కానీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగా వైభవంగా జరిగిన వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీతోపాటు.. పవర్ స్టార్ ఫ్యామిలీ, హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లి నాలుగు రోజులపాటు పెళ్లి వేడుకలను ఘనంగా చేశారు.