Tollywood: చేసింది ఒక్క సినిమానే.. కట్ చేస్తే.. తెలుగులో తోపు హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈ వయ్యారి..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తున్నారు. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం చాలా స్పెషల్.
తెలుగులో ఒక్క సినిమా చేసి టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటనలోనే కాకుండా కరాటేలోనూ బ్లాక్ బెల్ట్ తీసుకుంది.
ఇప్పుడు మరో సినిమాతో తెలుగు సినీప్రియులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. సూపర్ హిట్ మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అనంతిక.
కేరళకు చెందిన అనంతిక ఐదేళ్ల వయసులోనే శాస్త్రీయ నాట్యంలో శిక్షణ తీసుకుంది. కథాకళి, భరతనాట్యం, మోహినీ అట్టం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ తీసుకుంది.
అనంతిక కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. కేరళకు ప్రత్యేకమైన కలరిపయట్టు మార్షల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం సాధించింది. గతేడాది ఇంటర్ పూర్తి చేసిన అనంతిక.. మ్యాడ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఈ మూవీతో తెలుగులో చాలా పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం అనంతిక 8 వసంతాలు అనే చిత్రంలో నటిస్తుంది. అనంతిక గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది. తన ఇన్ స్టాలో ట్రెడిషనల్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.