సాయి పల్లవి పూర్తి పేరు.. సాయి పల్లవి సెంతామరై. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలోని.. సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ అందుకు అనుగుణంగా కాళ్లు కదిపేది.. ఆ బాణీలకు తనదైన స్టైల్లో స్టెప్పులేసేది.

డ్యాన్స్ మీదున్న మక్కువతో 2009లో ఓ ప్రముఖ ఛానెల్లో నిర్వహించిన ఢీ షోలో పాల్గోని ఫైనలిస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత 2008లో జయం రవి హీరోగా తెరకెక్కిన ధామ్ ధామ్ సినిమాలో నటించింది. 2014లో మలయాళ చిత్రం ప్రేమమ్లో హీరోయిన్గా నటించి మెప్పించింది.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో భానుమతి పాత్రలో ఒదిగిపోయింది సాయి పల్లవి.. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సాయి పల్లవి నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచె మనసు, మారి 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇటీవల శేఖర్ కమ్ముల , నాగ చైతన్య కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని నటించి శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించి మెప్పించింది.

రానా దగ్గుబాటి సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి పల్లవి మేకప్ లేకుండానే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

ఫెయిర్నెస్ క్రీమ్ ప్రచారాన్ని చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే తనకు అసత్య ప్రచారాలను చేయడం ఇష్టం లేదని కోట్ల ఆఫర్ను రిజెక్ట్ చేసింది.