నిజంగానే ఈ పాట శ్రీలీల కెరీర్‌కు బాగా సూట్ అవుతుందిప్పుడు. ఆమె సినిమాలను చూసాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు.. మీ కెరీర్‌కు వాట్స్ హ్యాపెనింగ్ అని..! అదేదో రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ మధ్య శ్రీలీల కెరీర్ చూస్తుంటే..! భగవంత్ కేసరి మినహాయిస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ.
శ్రీలీల సినిమాలో ఉన్నారంటే.. మూడు పాటలు.. అందులో డాన్స్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. కేవలం డాన్స్ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. తాజాగా రాబిన్ హుడ్.. వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరీర్‌కు ఉపయోగపడలేదు.
పైగా ఎందుకిలాంటి రోల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. చేసిన 8 సినిమాల్లో.. పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్టు.. గుంటూరు కారం పర్లేదనిపించింది. మిగిలినవన్నీ ఫ్లాపే.
గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర, NC24, అఖిల్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి.
సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు శ్రీలీల. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టైతే.. శ్రీలీల పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేయడం ఖాయం. కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే.. కెరీర్ గాడిన పడుతుంది.