
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఇక ఒకప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ పలు సినిమాలను రిజక్ట్ చేసింది. అంతే కాకుండా ఒక డిజాస్టర్ నుంచి బయటపడింది. కాగా, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా, అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ జంటలుగా నటించిన చిత్రం మహా సముద్రం. ఈ మూవీ రిలీజై డిజాస్టర్ అందుకుంది. `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సమంత అనుకున్నారంట. కానీ ఈ బ్యూటీ ఈ మూవీ రిజక్ట్ చేయడంతో అదితిరావుకు అవకాశం వచ్చింది. అలా సమంత డిజాస్టర్ నుంచి బయట పడింది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఇవే కాకుండా పలు హిట్ సినిమాలు కూడా వదులుకుంది. అందులో మెగా హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు. అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్ గా అనుకున్నారంట కానీ, సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతనున్నందున ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట.

శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఐ. ఈ మూవీలో హీరోయిన్ గా అమీర్ జాక్సన్ నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనౌన్స్ చేశారు . కానీ కొన్ని కారణాల వలన సమంత ఈ మూవీ నుంచి తప్పుకున్నదంట.

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకుందాం అనుకున్నారంట. కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవడంతో తాను కాదనడంతో రష్మికకు అవకాశం వచ్చింది.