
సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బందుల్లో పడ్డారు.

వరుస ఫెయిల్యూర్స్ ఎదరువ్వటంతో సక్సెస్ కోసం మరోసారి ప్రయోగం చేస్తున్నారు. రీసెంట్‌గా బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన శభాష్ మిథు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు తాప్సీ.

ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు క్రికెట్ నేర్చుకొని మరీ మిథాలీ రాజ్ క్యారెక్టర్‌ను ప్లే చేశారు. ఇంత కష్టపడినా సినిమాకు అనుకున్న రిజల్ట్ రాలేదు. తాప్సీ నటించిన మరో స్పోర్ట్స్ డ్రామా రష్మి రాకెట్ కూడా సక్సెస్ లిస్ట్‌లోకి చేరలేదు.

ఈ మూవీలో అథ్లెట్‌గా కనిపించేందుకు నెలల తరబడి వర్కవుట్స్ చేసి ప్రొఫెషనల్ రన్నర్‌లా రెడీ అయ్యారు తాప్సీ. కానీ ఆ కష్టం అంతా వృథా అయ్యింది. దీంతో అప్ కమింగ్ మూవీ దొబారా మీదే ఆశలు పెట్టుకున్నారు ఢిల్లీ బ్యూటీ.

వరుస ఫెయిల్యూర్స్‌తో ఆలోచనలో పడ్డ తాప్సీ.. ఆటలు పక్కన పెట్టి థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ తనకు రెండు హిట్స్ ఇచ్చిన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ టైమ్ లెస్ థ్రిల్లర్‌ను రిలీజ్‌కు రెడీ చేశారు.

26 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ కుర్రాడు... ఓ టీవీ ద్వారా తాప్సీతో మాట్లాడటం. ఆ కుర్రాడి ద్వారా తెలుసుకున్న విషయాలతో అప్పటి మర్డర్ కేసును తాప్సీ సాల్వ్ చేయటం అన్న పాయింట్‌ను ఈ సినిమాలో థ్రిల్లింగ్ చూపిస్తున్నారు. ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయటంతో ఈ మూవీ తాప్సీ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్‌లో పెడుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్.