Cinema : స్టార్‌డమ్ హడావుడి లేదు.. పెద్ద ప్రచారమే లేదు.. అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..

Updated on: Aug 26, 2026 | 9:29 PM

స్టార్‌డమ్ హడావుడి లేకుండా, ప్రమోషన్‌పై పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే, ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఏంటో తెలుసుకోండి. అంతేకాదు.. ఈ మూవీలో స్టార్ హీరో నటించినప్పటికీ అంతగా ప్రమోషన్స్ మాత్రం నిర్వహించలేదు. కేవలం పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది.

1 / 5
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'అవరపన్ 2' 'బంట్వారా 1947' చిత్రాల గురించే చాలా చర్చ జరుగుతోంది. అయితే, ఈ రెండు చిత్రాల సందడి మధ్యలో, విడుదలైన ఒక సినిమా విడుదలై కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసింది. కుటుంబ సంబంధాలు, ప్రేమ , భావోద్వేగ సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

2 / 5
ఈ చిత్రానికి మంచి ఆరంభం లభించింది. మొదటి రోజు ఈ చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద రూ. 15.35 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ సంఖ్య రూ. 22.25 కోట్లకు చేరుకుంది. మూడవ రోజు కూడా ప్రేక్షకుల స్పందన కొనసాగింది. నాలుగు రోజుల్లో, ఈ చిత్రం భారతదేశంలో రూ. 65.95 కోట్ల నికర వసూళ్లు మరియు రూ. 76.27 కోట్ల స్థూల వసూళ్లు సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో నటించారు.

3 / 5
పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంజయ్, కుటుంబ ఒత్తిడి కారణంగా తన జీవితంలో ఒక పెద్ద మార్పుకు గురవుతాడు. అతను సరోగసీ ద్వారా ఒక బిడ్డకు తండ్రి అవుతాడు. ఆ తర్వాత, ఆ బిడ్డ జీవితంలో తలెత్తిన తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా, అతను మమితా బైజు పోషించిన మ్యాడీ పాత్రను కలుస్తాడు. ఈ సినిమా పేరు 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇందులో సూర్యతో పాటు మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ నటించారు.

4 / 5
 తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో మంచి వసూళ్లు సాధించింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లు వసూలు చేసిన సూర్య 'కరుప్పు' జీవితకాల వసూళ్లను 'విశ్వనాథ్ అండ్ సన్స్' అధిగమిస్తుందో లేదోనని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

5 / 5
ఈ సినిమా కథ 42 ఏళ్ల ఒలింపిక్ పతక విజేత, వ్యాపారవేత్త అయిన సంజయ్ విశ్వనాథ్ (సూర్య) చుట్టూ తిరుగుతుంది. అతను కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. కానీ అతని తల్లి నిర్మలా దేవి (రాధిక) తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలనుకోవడంతో, సంజయ్ చివరికి సరోగసీ ద్వారా తండ్రి అవుతాడు. అయితే, ఆ బిడ్డ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో, అతని చికిత్స కోసం కుటుంబం సరోగసీ తల్లి అయిన మాడి (మమితా బైజు)ని పిలవాల్సి వస్తుంది. ఇంతకీ ఈ సినిమాను మీరు చూశారా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us