
తెలుగు సినీప్రియులకు అందాల యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో.. అల్లరితో అదరగొట్టేస్తుంది రాములమ్మ.

ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో దాదాపు టైటిల్ చేరువలో నిలిచి రన్నరప్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో ఈ అందాల యాంకర్ చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది శ్రీముఖి. అద్దాల లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తూ హృదయాలను కొల్లగొట్టేస్తుంది శ్రీముఖి.

ఇదిలా ఉంటే.. శ్రీముఖి చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీలో కనిపించింది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.