
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎనర్జీ డ్యాన్స్, స్క్రీన్ ప్రెజన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇప్పుడు ఆమె సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.

కానీ కొన్ని నెలలుగా శ్రీలీల నటించిన సినిమాలు హిట్టు కావడం లేదు. అయినప్పటికీ ఈ బ్యూటీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే పరాశక్తి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ తమిళంలో ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం హీరో ధనుష్, సాయి పల్లవి కాంబోలో వస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఈ చిత్రానికి అమరన్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల.

అలాగే ఇప్పుడు మరోసారి శ్రీలీల పేరు మారుమోగుతుంది. తమిళ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చిందని టాక్. కొన్నాళ్లుగా రేసింగ్ లో బిజీగా ఉన్న అజిత్.. ఇప్పుడు తన కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట.అందులో శ్రీలీల హీరోయిన్ అని ఛాన్స్.