
మహేష్ బాబు- నమ్రతల గారాల పట్టి సితారా ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన వస్తుంటుంది.

కాగా సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే సొంత యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. పలువురు ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేసిన వీడియోలు ఇందులో ఉన్నాయి.

తాజాగా సితార మరొక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె తల్లి నమ్రతతో కలిసి మిర్రర్ సెల్ఫీ దిగింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

కాగా మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ సాంగ్‌లో సితార స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. త్వరలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని సమాచారం.

సితార ఇటీవల తన తల్లి నమ్రతతో కలిసి పారిస్‌కు వెళ్లింది. అక్కడ ప్రఖ్యాత ఈఫిట్ టవర్ వద్ద ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కూడా వైరల్‌గా మారాయి.