
లోకనాయకుడు కూతురు శ్రుతిహాసన్ తండ్రికి తగ్గ తనయి అనిపించుకుంటుంది. ఈ మల్టీటాలెంటెడ్ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

ఈ మధ్యకాలంలో శ్రుతిహాసన్ కనిపించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. హీరోయిన్ గానే కాదు సింగర్ గాను రాణిస్తుంది ఈ చిన్నది.

తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్రుతిహాసన్. ఇటీవలే సలార్ సినిమాతో హిట్ అందుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది ఈ వయ్యారి భామ.

తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది శ్రుతిహాసన్. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ భామ.