Movie Updates: వరస సినిమాలతో దూసుకుపోతున్న శర్వా.. జాన్వీ తెలుగులో మరోటి..

| Edited By: Prudvi Battula

Mar 07, 2024 | 3:39 PM

శర్వానంద్ వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాస్త బ్రేక్ తీసుకున్నట్లు అనిపించినా ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నారీయన. జాన్వీ కపూర్ తెలుగులో బిజీ అవుతున్నారు. ఇప్పటికే దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ.  మమ్ముట్టి హీరోగా దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన భ్రమయుగం మలయాళంలో సంచలన విజయం సాధించింది. చెఫ్ మంత్ర సీజన్ 3ని ఘనంగా మొదలు పెడుతుంది ఆహా. మార్చి 6న అల్లు అర్జున్‌, స్నేహాల వివాహ వార్షికోత్సవం. 

1 / 5
శర్వానంద్ వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. కాస్త బ్రేక్ తీసుకున్నట్లు అనిపించినా ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నారీయన. శ్రీరామ్ ఆదిత్య సినిమాకు మనమే అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. అలాగే యువీ క్రియేషన్స్‌లో తన తర్వాతి సినిమాకు కమిట్ అయ్యారు శర్వానంద్. దీనికి అభిలాష్ రెడ్డి దర్శకుడు.

2 / 5
మమ్ముట్టి హీరోగా దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన భ్రమయుగం మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ డిఫెరెంట్ థ్రిల్ ఇచ్చింది. ఇదిప్పుడు ఓటిటిలో వచ్చేస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ఓ ప్రముఖ ఓటిటి తీసుకోగా.. మార్చి 15న మళయాళం సహా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది భ్రమయుగం.

3 / 5
చెఫ్ మంత్ర సీజన్ 3ని ఘనంగా మొదలు పెడుతుంది ఆహా. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి 8న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు సెలెబ్రిటీల వినోదాలు కూడా చాలానే ఉండబోతున్నాయి. ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు విజయం సాధించాయి. మొదటి సీజన్‌ను యాంకర్ శ్రీముఖి.. రెండో సీజన్‌ను మంచు లక్ష్మీ హోస్ట్ చేయగా.. మూడో సీజన్ కోసం నిహారిక వచ్చారు.

4 / 5
మార్చి 6న అల్లు అర్జున్‌, స్నేహాల వివాహ వార్షికోత్సవం. ఈ క్రమంలోనే భార్యపై తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో చూపించారు బన్నీ. స్నేహాతో ఉన్న ఫోటోను షేర్ చేసిన బన్నీ... హ్యాపీ అనివర్సరీ క్యూటీ, 13 ఏళ్లు పూర్తి అయ్యింది. నీతో బంధం కారణంగానే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నీవు నాకు ఎంతో శక్తిని ఇచ్చావు. మనం ఇద్దరం ఇలా మరిన్ని వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసారు.

5 / 5
జాన్వీ కపూర్ తెలుగులో బిజీ అవుతున్నారు. ఇప్పటికే దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ. జాన్వీ బర్త్ డే కానుకగా ఓ పోస్టర్ విడుదల చేసారు. ఆ మధ్య వచ్చిన లుక్‌లో జాన్వీ విలేజ్ గాళ్‌గా కనిపించగా.. ఇందులో మాత్రం కొంచెం విభిన్నంగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు.